Thu Dec 19 2024 18:21:36 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గుంటూరు జిల్లాలో జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో జగన్ పర్యటిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరులో జగన్ పర్యటిస్తారు. అక్కడ ఉన్న అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను జగన్ ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి మండలంలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్ర నిర్మాణానికి సంబంధించి జగన్ భూమి పూజ చేయనున్నారు.
గోకుల క్షేత్రం....
ఈ గోకుల క్షేత్రం బెంగుళూరుకు చెందిన ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మాణం కానుంది. ఆరున్నర ఎకరాల్లో హరేకృష్ణ మూమెంట్ ఆఫ ఇండియా ఈ గోకుల క్షేత్రాన్ని నిర్మించనుంది. ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story