Thu Dec 26 2024 20:38:29 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : టీడీపీ, జనసేన ఏం చేస్తున్నాయి? వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమే అని అన్న షర్మిల కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదన్నారు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని ఆమె ఆరోపించారు.
కర్ణాటకకు మాత్రం...
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15వేల కోట్ల సహాయం అందించారని, స్టీల్ ప్లాంట్ నుబతికించారని తెలిపారు. 243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి 26 వేల మంది పనిచేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు లేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే జేడీఎస్ 15వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే ఎన్డీఏకు ఊపిరి పోసిన టీడీపీ,జనసేన పార్టీలు మోడీకి సలాం కొడుతున్నాయని, 18 మంది ఎంపీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నారని అన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story