Wed Apr 23 2025 08:53:32 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : ఆర్టీసీ బస్సులో వైఎస్ షర్మిల
మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. హామీలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేశారని కూటమి నేతలు మర్చిపోతున్నారని వైఎస్ షర్మిల అన్నారరు.
తెనాలి వరకూ...
దీన్ని నిరసిస్తూ ఈరోజు విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి వరకూ ఆర్టీసీ బస్సులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రయాణించారు. మహిళలతో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ఆమె కోరారు.
Next Story