Mon Dec 23 2024 02:42:38 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప .. ఫ్లవర్ కాదు ఇక్కడ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఊపిరి పీల్చుకన్నారు. ఎస్టీ కాదంటూ హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఆమెకు రిలీఫ్ లభించింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఊపిరి పీల్చుకన్నారు. ఎస్టీ కాదంటూ హైకోర్టులో వేసిన పిటీషన్ పై ఆమెకు రిలీఫ్ లభించింది. ఈ కేసులో హైకోర్టు నియమించిన అప్పిలేట్ అథారిటీ పుష్ప శ్రీ వాణి ఎస్టీయేనని తేల్చి చెప్పింది. దీంతో ఉప ముఖ్మమంత్రిగా ఉన్న పుష్ప శ్రీ వాణి గత కొంత కాలంగా పడుతున్న టెన్షన్ కు తెరపడినట్లయింది.
ఉప ముఖ్యమంత్రిగా....
పాముల పుష్ప శ్రీ వాణి ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె డిప్యూటీ సీఎం అయ్యారు. పుష్ప శ్రీ వాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీనిపై హైకోర్టు అప్పిలేట్ అధారిటీని నియమించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ ఆమె ఎస్టీయేనని తేల్చింది. ఆమెది కొండదొర సామాజికవర్గమని, ఎస్టీ లో అది భాగమేనని చెప్పింది. దీంతో డిప్యూటీ సీఎం ఊరట చెందారు.
Next Story