Tue Nov 05 2024 15:20:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రేపు కూడా వడగాడ్పులు
రేపు ఏపీలోని ఏడు మండలాల్లో వడగాల్పులు వీసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రేపు ఏపీలోని ఏడు మండలాల్లో వడగాల్పులు వీసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు బయటకు వెళితే జాగ్రత్తలు పాటించాలని కోరింది. రేపు ఎండకు తోడుకు వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం రేపు ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని పేర్కొంది. రేపు 168 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
అత్యవసరమైతేనే...
ఎల్లుండి 106 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి,తూర్పుగోదావరి, ఏలూరు జిల్లా, గుంటూరు జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, కృష్ణా జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, ఇంట్లోనే ఉండటం మంచిదని సూచించింది.
Next Story