Tue Dec 03 2024 17:55:18 GMT+0000 (Coordinated Universal Time)
రేపు వాయుగుండం తీరందాటే అవకాశం... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తులు సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో ఒడిశా,ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఏపీ విపత్తులు సంస్థ తెలిపింది. ఇది రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందనిచెప్పింది. ఆతరువాత క్రమంగా వాయుగుండం బలహీనపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆ ప్రభావంతో....
కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం 3ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. ప్రవహిస్తున్నవాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచించింది.
Next Story