Mon Apr 14 2025 13:30:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. జూన్ 14న బుధవారం ఉదయం

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. జూన్ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల చేస్తారని తెలిపారు. మే 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు ముగిసన తరువాత ఈఏపీసెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. మే 24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు.
ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3,37,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. ఫలితాలను అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అనంతపురం జేఎన్టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహించారు.
Next Story