Fri Apr 11 2025 19:34:34 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections Survey : ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే అత్యధిక స్థానాలు.. తేల్చేసిన తాజా సర్వే
ఏపీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై టైమ్స్ నౌ, ఈటీజీ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో వైసీపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని తేలిసింది. లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్సభ స్థానాలున్నాయి. లోక్సభ స్థానాల వారీగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
టీడీపీకి ఒక్క స్థానం...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 24 లోక్సభ స్థానాలు దక్కేందుకు అవకాశముందని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం దక్కవచ్చని పేర్కొంది. జనసేన ఒక్క స్థానంలోనూ గెలవలేదని పేర్కొంది. టౌమ్స్ నౌ,ఈటీజీ అందించిన ఈ తాజా సర్వే ద్వారా అత్యధిక స్థానాలు ఫ్యాన్ పార్టీకి దక్కుతాయని తేలడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి ప్రజల మూడ్ మారే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
Next Story