Sun Dec 22 2024 21:16:43 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ కు 4, సంక్రాంతికి 8 రోజులు సెలవులు
ఈసారి క్రిస్మస్ కు ఏకంగా నాలుగురోజులు సెలవులొచ్చాయి విద్యార్థులకు. కొన్ని స్కూళ్లకు మాత్రం 23వ తేదీ నుంచి
ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల తేదీలను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. డిసెంబర్ 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు క్రిస్మస్ సెలవులను ప్రకటించగా.. 26వ తేదీ ఆదివారం కావడంతో.. ఈసారి క్రిస్మస్ కు ఏకంగా నాలుగురోజులు సెలవులొచ్చాయి విద్యార్థులకు. కొన్ని స్కూళ్లకు మాత్రం 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ క్రిస్మస్ సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయి. మిషనరీ స్కూళ్లు తిరిగి డిసెంబర్ 31వ తేదీన పునః ప్రారంభమవుతాయి.
సంక్రాంతికి 8 రోజులు
అలాగే 2022 జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ మొత్తం ఆరురోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే 9వ తేదీ, 16వ తేదీ ఆదివారాలు కావడంతో ఈసారి సంక్రాంతి ఏకంగా 8రోజులు సెలవులు వచ్చాయి. మిషనరీ స్కూళ్లు మినహా.. మిగతా స్కూళ్లు అన్నింటికీ ఈ సంక్రాంతి సెలవులు వర్తిస్తాయి. తిరిగి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచింది.
Next Story