Mon Dec 23 2024 10:27:06 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్: వారి పింఛన్ డబుల్ చేసిన ఏపీ ప్రభుత్వం
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రెండున్నర వేల చొప్పున పింఛన్ అందిస్తుండగా.. ఆ మొత్తాన్ని ఐదువేలకు పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేశారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పెంపు విషయాన్ని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి, భూములు లేక 17 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని సీఎం జగన్కు వివరించారు. వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని 2,500 నుంచి ఐదు వేలకు పెంచాలంటూ సీఎం జగన్ను అభ్యర్థించారు. మేకతోటి సుచరిత అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన జగన్.. వచ్చే నెల నుంచి పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story