Sat Dec 21 2024 16:03:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైకోర్టులో ఏపీ సర్కార్ కు ఊరట
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్ష పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై స్టే ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. గ్రూప్ 1 పరీక్ష పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై హైకోర్టు స్టే విధించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పడంతో దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కీలక ఆదేశాలు...
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు స్టే విధించింది. రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష రద్దుపై కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
Next Story