Mon Dec 15 2025 06:38:14 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ అడ్వొకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్
రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది

రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా ప్రముఖ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. గవర్నర్ అనుమతి కోసం రాజ్‌భవన్ కు ఫైలును పంపింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించారు. మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి దమ్మాలపాటిని అడ్వొకేట్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు బాధ్యతలను స్వీకరించే...
ఈ నెల 20వ తేదీన ఆయన ఏజీగా బాధ్యతలను స్వీకరించే అవకాశముందని తెలిసింది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా టీడీపీ తరుపున ఆయన హైకోర్టులో బలమైన వాదనలను వినిపించారు. వివిధ కీలక కేసుల్లో ఆయన వాదనలను జరిపి నాడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే మరోసారి దమ్మాలపాటికి ఏజీ పదవినిచ్చింది ప్రభుత్వం.
Next Story

