Tue Nov 26 2024 04:47:15 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో స్నో పార్క్.. స్థలం కోసం అన్వేషణ
ఏపీ ప్రభుత్వం విశాఖలోనే స్నో పార్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.20 కోట్ల ఖర్చు చేయనుంది.
మంచు పర్వతాలు ఎక్కుతూ.. మంచులో ఆటలాడుకోవడం చాలా మందికి ఇష్టం. కానీ.. అలాంటి చల్లని ప్రదేశాలు మనకి అందుబాటులో లేవు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉన్నా.. వివిధ కారణాలతో వెళ్లలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారికోసం ఏపీ ప్రభుత్వం విశాఖలోనే స్నో పార్క్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్నో పార్కును ఏర్పాటు చేసేందుకు సుమారు 2 ఎకరాల స్థలంతో పాటు రూ.20 కోట్ల ఖర్చు కూడా ఉంటుంది. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ పార్కు కోసం స్థల అన్వేషణ చేస్తున్నారు అధికారులు.
ఎన్నో ప్రత్యేకతలతో....
మంచులో బాస్కెట్బాల్, ఇంకా ఎన్నో ప్రత్యేకలతో ఈ స్నో పార్కును ఏర్పాటు చేయాలని, అన్ని విధాలుగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పార్కులోనే మంచు పర్వతారోహణ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తారట. ఈ మేరకు చిన్నపాటి కృత్రిమ మంచు పర్వతాలను ఏర్పాటు చేస్తారు. అలాగే సినిమా షూటింగులు కూడా చేసేలా ఈ పార్కును ముస్తాబు చేయనున్నారు. సరైన స్థలం దొరకాలే గానీ.. బీచ్ రోడ్డులోనే స్నో పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పార్క్ హోటల్ పక్కన ఉన్న వీఎంఆర్డీఏ స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Next Story