Mon Dec 23 2024 04:17:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 269 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 269 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ 4, నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. ఆయుష్ ఆయుర్వేద విభాగంలో మూడు అధ్యాపక పోస్టులు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఆయుష్ విభాగంలో 34 లెక్చరర్ల పోస్టుల భర్తీ చేయనుంది.
ఈ విభాగాల్లో...
ఆయుష్ హోమియో విభాగంలో 53 మంది మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ ఆయుర్వేద విభాగంలో72 మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్ల కోసం ఈ ప్రకటన జారీ చేసింది. అలాగే వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 23 అసిస్టెంట్ ఇంజినీర్లు, పోస్టు మెడికల్ సైన్సెస్ విభాగంలో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి గల, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Next Story