Wed Apr 16 2025 18:15:14 GMT+0000 (Coordinated Universal Time)
Bheemla Nayak : భీమ్లాపై ఏపీ సర్కార్ ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించింది. థియేటర్ల యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు విధించింది. థియేటర్ల యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రేపు విడుదల కానుంది. అయితే ఏపీలో నాలుగు షోలకు మించి వేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
చర్యలు తప్పవంటూ.....
టిక్కెట్లు రేట్లు సయతం ప్రభుత్వ నిబంధనల మేరకు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే అంగీకరించబోమని చెప్పింది. అలా చేస్తే సినిమాటోగ్రఫీ చట్టం1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. థియేటర్ల వద్ద రెవెన్యూ అధికారుల నిఘా ఉంటుందని కూడా హెచ్చరికల్లో పేర్కొంది. కాగా భీమ్లా నాయక్ సినిమాకు ఐదో షో వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనిపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతుంది.
Next Story