Andhra Pradesh : నామినేటెడ్ పోస్టులు భర్తీ పూర్తి.. ఇరవై పోస్టులను ప్రకటించిన ఏపీ సర్కార్
నామినేటెడ్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
నామినేటెడ్ పోస్టులను భర్తీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఊరిస్తున్న పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరవై నామినేటెడ్ పోస్టులను ఇప్పటివరకూ భర్తీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్ గా కొనకళ్ల నారాయణను నియమించింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా అబ్దుల్ అజీజ్, ట్రైకార్ ఛైర్మన్ గా శ్రీనివాసులు, ఏపీఐఐసీ ఛైర్మన్ గా మంతెన రామరాజు, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ గా లంకా దినకర్, ఏపీ టూరిజం ఛైర్మన్ గా నూకసాని బాలాజీని నియమించింది. టిడ్కో ఛైర్మన్ గా జనసేనక్ుకేటాయించింది. శాప్ ఛైర్మన్ గా రవినాయుడును నియమించింది. మొత్తం ఇరవై పోస్టులలో పదహారింటిలో టీడీపీ నేతలను నియమించింది. మూడు జనసేనకు ఇచ్చింది. ఒకటి బీజేపీకి కేటాయించింది. మిగిలిన పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని సర్కార్ చెబుతుంది. పీతల సుజాత, పీలా గోవింద్ వంటి టిక్కెట్లు కోల్పోయిన వారికి కూడా నామినేటెడ్ పదవులు లభించాయి.