Tue Nov 05 2024 16:27:23 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ !
పట్టణాల్లోని జనమంతా పల్లెటూళ్లకు రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యంగా
ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ.. మరో ఉత్తర్వు జారీ చేసింది. సంక్రాంతి తర్వాతే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని అమలు చేయనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిజానికి.. సోమవారం రాత్రి నుంచే నైట్ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కానీ రెండ్రోజుల్లోనే సంక్రాంతి పండగ ఉంది.
పట్టణాల్లోని జనమంతా పల్లెటూళ్లకు రాకపోకలు ప్రారంభించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి వేలమంది ప్రజలు పండక్కి తరలివస్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా రాష్ట్రంలోకి భారీగా వస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ ఆంక్షలతో వారంతా ఇబ్బంది పడే పరిస్థితులుండటంతో.. జగన్ ప్రభుత్వం సంక్రాంతి తర్వాతి నుంచే కర్ఫ్యూ ను అమలు చేయాలని నిర్ణయిస్తూ.. అంతకుముందు జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.
Next Story