Mon Dec 23 2024 16:39:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఉపజిల్లాలకు నోటిఫికేషన్.. తక్షణమే అమల్లోకి
అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ..
ఏపీలో కొత్తగా ఉపజిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో భూముల రీ సర్వే అనంతరం పాలన, పౌరసేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా నిర్వహించేలా కొన్ని జిల్లాల్లో ఉప జిల్లాలను ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూల్, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ జిల్లాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తరపున జారీ చేసిన ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా ఏర్పాటు చేసిన ఉప జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఉప జిల్లాల్లోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 5 ప్రకారం ఈ కొత్త సబ్ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న గ్రామాలు ఇకపై ఉప జిల్లాల పరిధిలోకి వస్తాయని, రిజిస్ట్రేషన్ సేవల కోసం గ్రామ సచివాలయాల పరిధిని కూడా నోటిఫికేషన్ లో తెలిపింది.
Next Story