Mon Dec 23 2024 13:32:12 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం.. కొత్తపోర్టల్ లో దరఖాస్తు చేసుకోండిలా !
ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ కొత్తపోర్టల్ ను తీసుకొచ్చింది. కోవిడ్ తో ప్రాణాలు
కరోనా సోకి.. ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం నేరుగా బాధిత కుటుంబాలకే చేరే విధంగా ఓ కొత్తపోర్టల్ ను తీసుకొచ్చింది. కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం చెల్లించే విధంగా ఈ పోర్టల్ ను రూపుదిద్దింది. ఈ పోర్టల్ గురించి తెలుపుతూ రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి నోటిఫికేషన్ విడుదల చేశారు.
దరఖాస్తు చేసుకోండిలా
కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం.. http://covid19.ap.gov.in/exgratia పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో మృతుడికి కోవిడ్ సోకినట్లు నిర్థారించిన ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ లేదా మాలిక్యులర్ టెస్ట్ రిపోర్టుల్లో ఏదో ఒక డాక్యుమెంట్ ను పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ను అధికారులు పరిశీలించి బాధిత కుటుంబ సభ్యుల ఖాతాలో డబ్బు జమచేస్తారని ఉషారాణి తెలిపారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థికసహాయం అందించే ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె వెల్లడించారు.
Next Story