పరిశ్రమలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను స్థాపించాలనే ఉద్దేశ్యం ఎవరికి ఉన్నా కూడా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాము
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను స్థాపించాలనే ఉద్దేశ్యం ఎవరికి ఉన్నా కూడా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో తాము ఉన్నామంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అందుకే ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఒకేచోట లభించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ పేరుతో యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగున్నరేళ్లలో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 86 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. మూడేళ్ల నుంచి సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది.