Mon Dec 23 2024 16:19:17 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై పరువు నష్టం కేసు : ఏపీ ప్రభుత్వం ఆదేశం
ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దానిని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నారని పవన్ విమర్శలు చేశారు. మహిళల అక్రమ..
వారాహి రెండో విడత యాత్రలో భాగంగా జులై 9న ఏలూరులో నిర్వహించిన సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లమన్న పేరుతో ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దానిని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నారని పవన్ విమర్శలు చేశారు. మహిళల అక్రమ రవాణా వెనుక వాలంటీర్ల హస్తం ఉందని అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ సైతం నోటీసులు పంపింది. ఈ మేరకు వివిధ వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన వార్తల ఆధారంగా వాలంటీర్లపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై సీసీపీ 199/4 ప్రకారం కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసులు పెట్టాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ.. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ప్రభుత్వం నోటీసులు పంపింది. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో 53 శాతం యువతులు, మహిళలు వాలంటీర్లుగా సేవలు అందిస్తుండగా.. వారిని తప్పుపడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ప్రభుత్వం జారీ చేసిన జీఓపై పవన్ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి కేసులకు భయపడితే తాను పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. తనను ప్రాసిక్యూషన్ చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. నిర్మొహమాటంగా చేసుకోవచ్చని పవన్ స్పష్టం చేశారు. జగన్ సై అంటే అందుకు తాను సై అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లకు అధిపతి ఎవరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా మొత్తం ప్రైవేటు సంస్థ అయిన ఎఫ్ వోఏకు వెళ్తుందని.. ఏ జీవో కింద దీనిని ప్రైవేటుపరం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. "నేను మాట అన్నానంటే.. అన్నింటికీ సిద్ధపడే అంటా"నని స్పష్టం చేశారు. వాలంటీర్లు సేకరించే సమాచారం అంతా డేటా ప్రొటెక్షన్ కిందకు వస్తుందన్నారు. అలాంటి డేటా నానక్ రామ్ గూడలోని ఎఫ్ ఓఏ సంస్థకు వెళ్తోందన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని.. తప్పు చేసిన వాళ్లు శిక్షకు గురవక తప్పదని పవన్ తెలిపారు.
Next Story