Mon Dec 23 2024 06:53:59 GMT+0000 (Coordinated Universal Time)
లిఫ్ట్ లో చిక్కుకున్న ఏపీ మంత్రి, ఎమ్మెల్యే
ఆ సమయంలో మంత్రి ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక అందరూ కంగారు పడ్డారు. వెంటనే స్పందించిన..
ఏపీ వైద్య ఆరోగ్య శాఖమంత్రి విడదల రజిని, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. దాంతో అక్కడ కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. స్పందించిన సిబ్బంది ఎమర్జెన్సీ కీ తో లిఫ్ట్ డోర్ తెరవగా.. అందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే..
విశాఖపట్నం ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న విడదల రజిని శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు హెల్త్ క్యాంప్ ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థంకాక అందరూ కంగారు పడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఎమర్జెన్సీ కీ తో లిఫ్ట్ డోర్ తెరిచి మంత్రి, ఎమ్మెల్యే, ఇతర అధికారులను బయటకు తీసుకొచ్చారు. లిఫ్ట్ లో పరిమితికి మించి ఎక్కడంతో.. లోడ్ ఎక్కువై ఆగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. ఇటీవల తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Next Story