Tue Nov 05 2024 09:22:57 GMT+0000 (Coordinated Universal Time)
ట్విట్టర్ పై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం
న్యాయమూర్తులపై పెట్టిన పోస్టులను ట్విట్టర్లో డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేయగానే పోస్టులు కనిపిస్తున్నాయని
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్లో న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ట్విట్టర్ ను హెచ్చరించింది. న్యాయస్థానాలను గౌరవించని పక్షంలో.. వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాగే న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెడుతున్నా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ట్విట్టర్ పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది.
న్యాయమూర్తులపై పెట్టిన పోస్టులను ట్విట్టర్లో డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేయగానే పోస్టులు కనిపిస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే న్యాయమూర్తులపై పోస్టులు చేసి.. విదేశాల్లో ఉన్నవారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారో తెలపాలంటూ సీబీఐని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి వచ్చేవారంలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Next Story