Mon Dec 23 2024 05:31:17 GMT+0000 (Coordinated Universal Time)
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం..ఇకపై విచారణ అక్కడే !
ఏడేళ్లుగా అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల విచారణ ఏపీ హైకోర్టులోనే జరుగుతోంది. ఇకపై కూడా ఈ కేసుల విచారణను..
అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయగా వచ్చిన రూ.50 కోట్లతో పాటు.. ఈ కేసు విచారణను ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఏడేళ్లుగా అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసుల విచారణ ఏపీ హైకోర్టులోనే జరుగుతోంది. ఇకపై కూడా ఈ కేసుల విచారణను హైకోర్టులోనే కొనసాగించాలన్న డిపాజిటర్ల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
Also Read : రూ.10 లక్షల విలువైన గోవా మద్యం స్వాధీనం
ఏపీ డిపాజిటర్ల చట్టం ప్రకారం ఈ కేసులను విచారణ చేసే అధికారం ఏలూరు కోర్టుకే ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయాలని ఏలూరు కోర్టును ఆదేశించింది. అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ కేసులకు సంబంధించిన విచారణ ఫైల్స్ అన్నింటినీ ఏలూరు కోర్టుకు బదిలీ చేస్తూ.. విచారణ ముగించింది.
Next Story