Tue Dec 24 2024 03:12:49 GMT+0000 (Coordinated Universal Time)
"సినిమా" ఇక సోమవారమే
సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వ అప్పీల్ పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వ అప్పీల్ పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 35ను సింగిల్ జడ్జి కొట్టివేశారు. థియేటర్ యజమానుల ఇష్టప్రకారం రేట్లు పెంచుకోవచ్చని తీర్పు చెప్పారు. అయితే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజనల్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది.
జాయింట్ కలెక్టర్ కే...
ఈరోజు డివిజనల్ బెంచ్ కు ముందు విచారణకు వచ్చింది. సత్వరం దీనిపై విచారణ చేపట్టి సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేయాలన ప్రభుత్వ తరుపున న్యాయవాది కోరారు. లేకుంటే థియేటర్ యజమానులు టిక్కెట్లు రేట్లు పెంచుకునే అవకాశముందని వాదించారు. టిక్కెట్ ధరల పెంపుపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు పేర్కొంది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని పేర్కొంది. కానీ దీనిపై విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
Next Story