Tue Nov 05 2024 10:35:27 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వానికి ఊరట..మూవీ టికెట్ల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సినిమా టికెట్ల విక్రయాలపై ఇరు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా
అమరావతి : ఏపీ ప్రభుత్వానికి సినిమా టికెట్ల విక్రయంలో ఊరట లభించింది. సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానానికి హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాక్ లో సినిమా టికెట్ల అమ్మకాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అన్ని థియేటర్లు ఆన్లైన్లోనే టికెట్లను విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో.. ఈ విషయం హైకోర్టు గుమ్మంలోకి వెళ్లింది.
సినిమా టికెట్ల విక్రయాలపై ఇరు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా తీర్పునిచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా టికెట్లను అమ్ముకోవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్ని రోజులు పరిశీలించాలని పేర్కొంది. ప్రస్తుతానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తమ సొంత వేదికలపై టికెట్లను అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జులై 12వ తేదీకి వాయిదా వేసింది.
Next Story