Tue Nov 05 2024 09:21:49 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఉద్యోగులకు హైకోర్టు షాక్..
ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. ఆ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. ఉద్యోగుల
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై రగడ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పీఆర్సీ పై ఉద్యోగులు వెనక్కి తగ్గకుంటే.. ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా సరే.. తమ డిమాండ్లు సాధించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని ఉద్యోగులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ప్రభుత్వం తనపని తాను చేసుకుంటూ పోతోంది. కాగా.. తాజాగా ఏపీ ఉద్యోగులకు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
Also Read : ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్య..
ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వగా.. ఆ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టింది. ఉద్యోగుల సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని లంచ్ మోషన్ విచారణలో పిటిషనర్ కోరారు. ఈ విషయంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వానికి రిప్రజంటేషన్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. రాష్ట్రంలో కోవిడ్ రూల్స్ అమలులో ఉన్న నేపథ్యంలో ఉద్యోగుల ఛలో విజయవాడ అంశంపై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఛలో విజయవాడపై హైకోర్టు తమకు సంబంధం లేదని చెప్పడంతో.. ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది.
Next Story