Mon Dec 23 2024 22:57:39 GMT+0000 (Coordinated Universal Time)
సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అందుకే లీవ్ పై వెళ్లారు: హోంశాఖ మంత్రి
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడం హాట్ టాపిక్ గా
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్యకు అనారోగ్యం కారణంగా.. ఆయన సెలవు పెట్టారని అన్నారు. జైలులో చంద్రబాబు నాయుడుకు అన్ని సదుపాయాలూ ఉన్నాయని అన్నారు. సెంట్రల్ జైలులో బ్లాక్ మొత్తం చంద్రబాబుకి కేటాయించాం.. సీసీ కెమెరాలతో పాటు భద్రత కట్టు దిట్టంగా ఉందని అన్నారు.
రాహుల్ శుక్రవారం నుంచి సెలవుపై వెళ్లారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్ భార్యను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ, జనసేన పొత్తుపై కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. టీడీపీ, జనసేన పొత్తు బ్రేకింగ్ న్యూస్ కాదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇన్నిరోజులు ఒకరికొకరు కలిసి ప్రయాణం చేస్తున్నారు.. ఇప్పుడు కొత్తేమీ కాదని అన్నారు. పవన్ ఈజీగా అబద్ధాలు చెప్పుతున్నారని విమర్శించారు. వారాహి యాత్ర కూడా చంద్రబాబు చెబితేనే పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు.
Next Story