Sun Dec 22 2024 22:49:14 GMT+0000 (Coordinated Universal Time)
5వ తేదీ తర్వాత ఉద్యమం మరింత ఉధృతం
ఈ నెల 5న తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు
ఈ నెల5వ తారీకు ఈసీ మీటింగ్ విజయవాడలో నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ,కాంట్రక్టు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుఇప్పటికే నిర్వహిస్తున్నమాని, ఇప్పటి వరకు ప్రభుత్వంతో రెండుసార్లు సమావేశాలు జరిగినా ఎలాంటి ఫలితాలు లేవని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బుల్ని జమ చేశామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఎంత జమ చేసిందో లిఖితపూర్వకంగా అడుగుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు3 వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వం ఇచ్చామని మెడికల్ రీ ఎంబర్స్మెంట్స్ 50 కోట్లు ఇచ్చామని చెబుతుందని, ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం కొత్త డీఏలు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని బొప్పారాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
అనేక ఒప్పందాలు...
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఆర్సీ అరియర్స్ ఒప్పందం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. తక్షణమే పీఆర్సీపై జాప్యాన్ని నివారించి కొత్త పే స్కేల్ ను విడుదల చేయాలని కోరామని తెలిపారు. 12వ పీఆర్సీ నిధులు విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారని బొప్పరాజు కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాల్సి ఉందన్నారు. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నదే తమ డిమాండ్ అని ఆయన చెప్పుకొచ్చారు. కొత్తగా అమలు చేసిన 13జిల్లాల ప్రధానకార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. తాము మలిదశ ఉద్యమాన్ని చేస్తున్నామని, మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా జరగనున్న ఉద్యమానికి సహకరించాలని బొప్పారాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
Next Story