Mon Dec 23 2024 00:36:02 GMT+0000 (Coordinated Universal Time)
వైద్య ఉద్యోగులు సయితం సమ్మెలోకే
ఏపీ వైద్య ఆరోగ్య సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని డిసైడ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాలని డిసైడ్ చేశారు. డాక్టర్ల నుంచి ఆశా వర్కర్ల వరకూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. 11వ పీఆర్సీ సాధన కోసం పీఆర్సీ సాధన సమితి కి మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. ఏపీ ఎన్జీవో భవన్ లో దాదాపు నాలుగు గంటలకు పైగా జరిగిన సమావేశంలో అనేక విషయాలపై చర్చించారు.
గంటల పాటు చర్చించి......
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో తాము కూడా సమ్మెలోకి వెళితే ఎలా ఉంటుందన్న దానిపై చాలా సేపు చర్చించారు. కానీ ఉద్యోగ సంఘాల్లో ఐక్యత ఉండాలని, లేకుంటే డిమాండ్లను సాధించుకోలేమని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 3వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనాలని, తర్వాత ఏడోతేది నుంచి సమ్మెలో కూడా పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.
Next Story