Mon Dec 23 2024 12:59:26 GMT+0000 (Coordinated Universal Time)
అదే నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా - మంత్రి కొడాలి నాని
మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆటను నిర్వహించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ రాజకీయ రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆటను నిర్వహించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ విషయాన్నే ప్రధానాస్త్రంగా మలచుకుంటోంది. ఈ క్రమంలోనే నేడు ఆ పార్టీ నేతలు క్యాసినో పై నిజ నిర్థారణ కోసం గుడివాడకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read : సూపర్ మార్కెట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
ఈ విషయంపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని... అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. మంత్రి సవాల్ తో క్యాసినో రగడ మరింత పెద్దదయ్యేలా కనిపిస్తోంది. చంద్రబాబు టైమ్ అయిపోయిందని, ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని విమర్శించారు.
Next Story