Mon Dec 23 2024 16:30:33 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడలా.. ఇప్పుడిలా స్పందించిన మంత్రి రోజా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాంపై ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారని
చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు మంత్రి రోజా స్పందించిన తీరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. రోజా టపాసులు కాల్చి, స్వీట్లు పంచడం అత్యంత దారుణమైన విషయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో రోజా తనదైన శైలిలో స్పందించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాంపై ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసిందని మంత్రి రోజా ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ ఏం చెబుతుందన్నారు. తనపై కేసులు కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్లను కొట్టివేసిందని, అసెంబ్లీలో చర్చించకుండా టీడీపీ నేతలు తప్పించుకున్నారని ఆరోపించారు రోజా. తనపై వేసిన కేసులను కొట్టివేయాలని మీరు వేసిన పిటిషన్లను.. అది కుదరదని చెప్పి హైకోర్టు కొట్టేసింది.. ఇప్పుడేమంటావ్ బాలకృష్ణా! అని నేను అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదన్నారు రోజా. నీకు దమ్ముంటే, దైర్యం ఉంటే హైకోర్టు వద్దకు వెళ్లి, జడ్జి ముందు ఇలాగే తొడగొట్టి, మీసం తిప్పి, విజిల్స్ వేయండి అప్పుడు తెలుస్తుందని అన్నారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు రోజా.
Next Story