Mon Dec 23 2024 16:00:35 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రి ఆర్కే రోజా మొబైల్ మిస్సింగ్
తిరుపతి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. గురువారం తిరుపతిలో
తిరుపతి: తిరుపతి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. గురువారం తిరుపతిలో పర్యటించిన మంత్రి రోజా పలు కార్యక్రమాల్లో పాల్గొని ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. సమావేశానికి హాజరైన తర్వాత రోజా తన మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందని గుర్తించి వర్సిటీ ఆవరణలో వెతికారు.
మంత్రి రోజా మొబైల్ మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్ ను వెతికేందుకు మూడు బృందాలను నియమించారు. ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రుయా ఆసుపత్రి సమీపంలోని మొబైల్ సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేసి, మొబైల్‌ను వెతకడానికి వెతుకుతున్నట్లు తెలిసింది.
Next Story