Mon Dec 23 2024 08:44:59 GMT+0000 (Coordinated Universal Time)
AP Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీ.. మరో అడుగు పడింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకుని రావాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకుని రావాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో కూటమి నేతలు నాణ్యమైన మద్యం, తక్కువ ధరకే మద్యం తీసుకుని వస్తామని చెప్పారు. ఇక నూతన మద్యం పాలసీ విషయంలో చాలానే ప్రణాళికలను రచిస్తోంది ఏపీ ప్రభుత్వం. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుండడంతో నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది. తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. ఇప్పటికే అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది.
ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి బార్లు, మద్యం దుకాణాలు, బేవరేజెస్ కంపెనీల్లో అమలవుతున్న విధివిధానాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోంది. ఏపీలో ఎలాంటి మద్యం పాలసీ రాబోతోందో అని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story