Mon Dec 23 2024 14:32:08 GMT+0000 (Coordinated Universal Time)
వ్యూహం టీజర్ పై వర్మకు వార్నింగ్
ఆర్జీవీ రిలీజ్ చేసిన వ్యూహం టీజర్లో అప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ను బెదిరించినట్లు టీజర్లో చూపించారు. అంతేకాదు..
రామ్ గోపాల్ వర్మ.. నిన్న విడుదల చేసిన "వ్యూహం" టీజర్.. ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఏపీ రాజకీయాలు, వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ అరెస్ట్, పాదయాత్ర..చంద్రబాబు సీఎం అవ్వడం వంటి విషయాలను "వ్యూహం"లో, జగన్ సీఎం అయినప్పటి నుండి జరిగిన పరిణామాలు శపథం లోనూ చూపించనున్నారు. ప్రస్తుతం విడుదలై "వ్యూహం" టీజర్ పై.. సర్వత్రా చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా ? అన్న చర్చ ఇప్పటి నుండే మొదలైంది. అయితే.. రాష్ట్ర పార్టీలే కాదు.. జాతీయ పార్టీ కూడా "వ్యూహం"పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ టీజర్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కించపరిచే విధంగా తీశారని ఆరోపిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఆర్జీవీ రిలీజ్ చేసిన వ్యూహం టీజర్లో అప్పటి కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ను బెదిరించినట్లు టీజర్లో చూపించారు. అంతేకాదు.. జగన్ తలొగ్గపోవడంతోనే సీబీఐ కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టినట్లు వర్మ టీజర్ లో చూపించారు. దాంతో వర్మ "వ్యూహం"పై ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఫైర్ అయ్యారు. టీజర్ లో వైఎస్సార్ మరణాన్ని చూపించిన నేపథ్యంలో.. సినిమాలో సోనియా గాంధీని కించపరుస్తూ చూపిస్తే బట్టలూడదీసి కొడతాం.. గాంధీ, నెహ్రూల కుటుంబాలను విమర్శిస్తే ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. సంచలనాలు సృష్టించేందుకే వర్మ ఇదంతా చేస్తున్నారని, కావాలనే లేని వాటిని ఉన్నవిగా చూపిస్తున్నారని మండిపడ్డారు.
Next Story