Mon Dec 23 2024 13:42:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా విశ్వరూపం చూపించిన కరోనా.. ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా విశ్వరూపం చూపించిన కరోనా.. ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40,357 మంది శాంపిల్స్ ను పరీక్షించగా.. 11,573 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. తాజాగా నమోదైన మరణాలతో కలిసి రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,594కి పెరిగింది.
Also Read : ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. కోవిడ్ రోగి మృతి
గడిచిన 24 గంటల్లో మరో 9,445 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 22,60,181 మందికి కరోనా సోకగా.. వారిలో 21,30,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,15,425 కోవిడ్ యాక్టివ్ కేసులుండగా.. వారంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
News Summary - AP Registered 11,573 new covid cases in 24 hours
Next Story