Mon Dec 23 2024 11:23:41 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో శాంతిస్తోన్న కరోనా.. గడిచిన 24 గంటల్లో ?
ప్రకాశం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు
ఏపీలో కరోనా కాస్త శాంతించింది. కొద్దిరోజులుగా రోజువారీ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 28,598 శాంపిళ్లను పరీక్షించగా.. 2,690 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో మరో తొమ్మిది మంది మరణించారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు.
వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,664కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 11,855 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకూ 23,03,455 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 22,19,219 మంది కోలుకున్నారు.
Next Story