Mon Dec 23 2024 14:16:06 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్ : కొత్తగా 103 కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,670 శాంపిళ్లను పరీక్షించగా.. 103 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీటిలో అత్యధిక కేసులు చిత్తూరు
ఏపీలో రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. రెండ్రోజుల క్రితమే 100 కు దిగువన నమోదైన రోజువారీ కేసులు.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28,670 శాంపిళ్లను పరీక్షించగా.. 103 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వీటిలో అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లాలో 26, గుంటూరులో 16, విశాఖలో 12, తూర్పు గోదావరిలో 10 కొత్తకేసులు నిర్థారణ అయ్యాయి. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇక ఇదే సమయంలో మరో 175 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 20,60,236కి చేరింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,077కి పెరిగింది. గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మృతి చెందగా.. మృతుల సంఖ్య 14,483కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.
Next Story