Mon Dec 23 2024 13:40:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో 662 మంది కరోనా బాధితులు మహమ్మారి నుంచి విముక్తి పొందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ..
ఏపీలో రోజువారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్ లో 182 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నేటి బులెటిన్ లో 244 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 18,803 శాంపిళ్లను పరీక్షించగా.. 244 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో కరోనాతో చిత్తూరు, కృష్ణాజిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,716కి చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 662 మంది కరోనా బాధితులు మహమ్మారి నుంచి విముక్తి పొందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23,16,711 మందికి కరోనా నిర్థారణ అవ్వగా.. 22,96,430 మంది దాని నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 5,565 యాక్టివ్ కేసులుండగా.. వారంతా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Next Story