Mon Dec 23 2024 17:14:15 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు
ఏపీలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో.. ఈ రోజు నమోదైన కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా రాష్ట్రవైద్యారోగ్య శాఖ విడుదల చేసిన
ఏపీలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో.. ఈ రోజు నమోదైన కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా రాష్ట్రవైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22, 882 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 4,108 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 21,10,388కి చేరింది.
ఇదే సమయంలో కరోనాతో పోరాడుతున్న 696 మంది విముక్తులయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణం నమోదు కాకపోవడంతో.. మృతుల సంఖ్య 14,510గా ఉంది. రికవరీల సంఖ్య 2065696గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,182 యాక్టివ్ కేసులుండగా.. వారంతా వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు.
Next Story