Sat Nov 23 2024 03:09:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కరోనా కల్లోలం.. వరుసగా మూడోరోజు భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు
తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,022 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..
ఏపీలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం 1000 లోపు ఉన్న కొత్తకేసులు.. ఇప్పుడు 4 వేలకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,022 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,06,280 కి పెరిగింది.
ఇదే సమయంలో చిత్తూరులో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14,510కి పెరిగింది. మరో 669 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 20,65,000గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,770కి పెరుగగా.. వారంతా ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 1124 కేసులు, విశాఖ జిల్లాలో 1028 కేసులు ఉన్నాయి.
Next Story