Mon Dec 23 2024 14:01:33 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
ఏపీలో ఇప్పటి వరకూ 23,18,858 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 23,03,522 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో..
అమరావతి : ఏపీలో రోజువారీ కరోనా కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,980 శాంపిళ్లను పరీక్షించగా.. 57 మందికి కరోనా నిర్థారణ అయింది. ఇదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు.
ఏపీలో ఇప్పటి వరకూ 23,18,858 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 23,03,522 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 606 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,730గా ఉంది. కాగా.. కరోనాకు సంబంధించిన అధికారిక సమాచారం తెలుసుకోవాలంటే.. 8297104104 నంబర్ కు Hi, Hello, Covid అని వాట్సాప్ నుంచి మెసేజ్ చేయవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వాట్సాప్ లేనివారు సాధారణ మెసేజ్ చేస్తే వారికి.. ఐవీఆర్ఎస్ కరోనా సమాచారాన్ని అందిస్తామని పేర్కొంది.
Next Story