Mon Dec 23 2024 18:40:29 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కోరలు చాచిన కరోనా.. తాజాగా ఎన్ని కేసులంటే ?
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో భారీగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్న 547 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గడిచిన 24 గంటల్లో 840 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ఇదే సమయంలో 133 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. విశాఖలో ఒకరు కోవిడ్ తో మృతి చెందారు.
తాజాగా నమోదైన కేసులతో కలిపి.. రాష్ట్రంలో 20,79,763 మందికి కోవిడ్ సోకగా.. వారిలో 20,62,290 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,972 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్ తో మరణించినవారి సంఖ్య 14,501కి చేరింది. ఇదిలా ఉండగా జనవరి 8వ తేదీ నుంచి రాష్ట్రంలో కఠినమైన కోవిడ్ ఆంక్షలు అమలవుతాయని సోషల్ మీడియాలో వార్తలొస్తుండగా.. వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
Next Story