Mon Dec 23 2024 13:41:02 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా బులెటిన్ : వెయ్యి దిగువకు కొత్తకేసులు
అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూ.గో జిల్లా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు
ఏపీలో రోజువారి నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నటి బులెటిన్ లో 1166 కొత్త కేసులు నమోదవ్వగా.. నేటి బులెటిన్ లో కొత్తకేసులు వెయ్యి దిగువకు చేరాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,066 శాంపిళ్లను పరీక్షించగా.. 896 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో కరోనాతో మరో ఆరుగురు మృతి చెందారు.
Also Read : వాషింగ్టన్ సుందర్ ను కొనుగోలు చేసిన హైదరాబాద్
అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, తూ.గో జిల్లా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,694కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో మరో 8,849 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకూ ఏపీలో 23,12,029 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 22,72,881 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,454 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Next Story