Tue Nov 05 2024 15:20:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్.. తాజాగా ఎన్నికేసులంటే..
నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో భారీస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో భారీస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 24,280 కోవిడ్ శాంపిల్స్ ను పరీక్షించగా.. 984 మందికి పాజిటివ్ గా తేలింది. వీటిలో అత్యధిక కేసులు చిత్తూరు జిల్లాలో నమోదయ్యాయి. చిత్తూరులో 244, విశాఖలో 151, తూ.గో. జిల్లాలో 117 కేసులు వెల్లడయ్యాయి.
ఇక ఇదే సమయంలో 152 మంది కరోనా నుంచి కోలుకోగా.. కరోనాతో ఎవ్వరూ మరణించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,82,843 మంది కరోనా బారినపడగా, 20,62,732 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకూ 14,505 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 5,606 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Next Story