Sat Nov 23 2024 08:43:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నాలుగు కి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. ఈరోజే రెండు కేసులు !
ఈరోజు ఉదయమే తూ.గో జిల్లాలో ఒకటి, విశాఖలో మరొక ఒమిక్రాన్ కేసులను అధికారులు గుర్తించారు. ఇటీవల
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కొత్తవేరియంట్ గా పేర్కొంటున్న ఒమిక్రాన్ పాగా వేసింది. చాపకింద నీరులా విస్తరిస్తూ.. అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఈరోజు ఉదయమే తూ.గో జిల్లాలో ఒకటి, విశాఖలో మరొక ఒమిక్రాన్ కేసులను అధికారులు గుర్తించారు. ఇటీవల కువైట్ నుంచి తూ.గో. జిల్లా అయినవిల్లి మండలం నేదునూరిపాలెనికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్థారణ అయింది. బాధిత మహిళ ఈనెల 19వ తేదీన కువైట్ నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆమెతో కాంటాక్ట్ అయిన కుటుంబసభ్యులు, సన్నిహితులకు సైతం వైద్యపరీక్షలు నిర్వహించగా.. ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విశాఖ జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. ఇటీవల యూఏఈ నుంచి విశాఖకు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. బాధిత వ్యక్తి ఈ నెల 16వ తేదీన నగరానికి వచ్చినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్ట్ అయినవారి వివరాలను సేకరించి, కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తూ.గో జిల్లాకు చెందిన మహిళతో పాటు.. విశాఖకు చెందిన వ్యక్తిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కాగా.. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదవ్వగా.. రెండవ కేసు తిరుపతిలో వెలుగుచూసింది.
Next Story