Mon Dec 23 2024 14:08:22 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ కరోనా అప్ డేట్
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 635 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య..
రెండ్రోజులుగా ఏపీ రోజువారీ పాజిటివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. నిన్న విడుదలైన కరోనా బులెటిన్ లో 244 కేసులు నమోదవ్వగా.. తాజాగా విడుదలైన బులెటిన్ లో 253 కేసులు నమోదయ్యారు. ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 19,432 శాంపిళ్లను పరీక్షించగా 253మందికి కరోనా నిర్థారణ అయింది. ఇదే సమయంలో చిత్తూరులో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో మరొకరు కరోనాతో ప్రాణాలు విడిచారు.
Also Read : నయా ట్రెండ్.. హైదరాబాద్ లో డ్రైవ్ ఇన్ థియేటర్
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 635 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,718కి చేరింది. ఇప్పటి వరకూ ఏపీలో 23,16,964 మందికి కరోనా నిర్థారణ అవ్వగా.. 22,97,065 మంది మహమ్మారి బారి నుంచి విముక్తులయ్యారు. 5,181 యాక్టివ్ కేసులు ఉండగా.. వారంతా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story