Fri Mar 14 2025 11:48:54 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కొత్తగా 5 కోవిడ్ కేసులు
నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో 4,169 శాంపిళ్లను పరీక్షించగా.. 5 కోవిడ్ కేసులు..

అమరావతి : ఏపీలో కొత్తగా 5 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో 4,169 శాంపిళ్లను పరీక్షించగా.. 5 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి, విశాఖ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో ముగ్గురు కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా మరణమూ సంభవించలేదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఏపీలో 3,35,31,114 శాంపిళ్లను పరీక్షించారు. కరోనా మరణాల సంఖ్య 14,730గా ఉంది.
Next Story