Mon Dec 23 2024 18:29:52 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 3 జిల్లాల్లో కేసుల్ నిల్
గడిచిన 24 గంటల్లో 21 వేల 211 కోవిడ్ శాంపిల్స్ ను పరీక్షించగా అత్యధికంగా విశాఖ జిల్లాలో
ఏపీలో కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసులతో పోలిస్తే.. గడిచిన 24 గంటల్లో గణనీయంగా పాజిటివ్ కేసులు తగ్గాయి. 100 లోపే కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కరోనా విజృంభించినప్పటి నుంచి 100 లోపు పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల మేరకు.. గడిచిన 24 గంటల్లో 21 వేల 211 కోవిడ్ శాంపిల్స్ ను పరీక్షించగా 75 కొత్తకేసులు బయటపడ్డాయి. వీటిలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 17 కేసులు నమమోదవ్వగా.. చిత్తూరులో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.
కర్నూల్, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తకేసులు నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో ఒకరు కరోనాతో చనిపోయారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోవిడ్ చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,480కి పెరిగింది. అలాగే గడిచిన 24 గంటల్లో 154 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 20,59,882కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20,75,879 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 1517 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Next Story