Mon Dec 23 2024 18:22:36 GMT+0000 (Coordinated Universal Time)
బోసిపోయిన ఏపీ సచిచాలయం
ఏపీ సచివాలయం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈరోజు నుంచే విధులను పక్కన పెట్టాలని నిర్ణయించారు
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈరోజు నుంచే విధులను పక్కన పెట్టాలని నిర్ణయించారు. కొత్త పీఆర్సీని రద్దు చేయాలని, హెచ్ఆర్ఏలో కొతలు ఆపాలంటూ రేపు ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయనున్నారు. ఎల్లుండి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు.
పెన్ డౌన్ కు దిగిన ఉద్యోగులు
ఈ నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు తాము విధులకు హాజరయినా పనులు చేయబోమని చెబుతున్నారు. దీంతో ఏపీ సచివాలయం బోసి పోయి కనిపిస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని వారు కోరుతున్నారు.
Next Story